

అమెరికా తన 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, ఫోర్బ్స్ విడుదల చేసిన ‘అమెరికాలో జీవించి ఉన్న 250 మంది గొప్ప వలసదారులు’ జాబితాలో 27 మంది భారత సంతతి ప్రముఖులు చోటు దక్కించుకోవడం విశేషం. అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం, విజ్ఞానం, సంస్కృతి, ప్రజా జీవితాలపై విశేష ప్రభావం చూపిన వ్యక్తులను ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆధునిక అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంత కీలకమో ఈ జాబితా మరోసారి చాటిచెప్పింది.
ఈ జాబితాలో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, సంజయ్ మెహ్రోత్రా, ఇంద్రా నూయి, జయ్ చౌదరి, వినోద్ ఖోస్లా, అభిజిత్ బెనర్జీ. తదితరులు ఉన్నారు. అలాగే అమెరికా రూపురేఖలను మార్చిన టాప్-5 వలసదారులుగా ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్, ఎలాన్ మస్క్, సెర్గీ బ్రిన్, జెన్సెన్ హువాంగ్, రూపర్ట్ మర్డోక్ లను ఫోర్బ్స్ ప్రస్తావించింది. అమెరికాలో వలసలపై రాజకీయ చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ జాబితా విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!