
సినిమాలు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ కనిపించిన ఘటనపై ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సంస్థపై చర్యలు తీసుకుంది. అహ్మదాబాద్–ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ప్రయాణించిన వ్యక్తి ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో ఈగ కనిపించడంతో వెంటనే ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై రైలు కెప్టెన్ మరియు క్యాటరింగ్ మేనేజర్ ప్రయాణికుడిని కలసి క్షమాపణలు తెలిపారు. ప్రత్యామ్నాయ భోజనం అందిస్తామని చెప్పినా, ఆయన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఐఆర్‌సీటీసీ రూ.1 లక్ష జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ రద్దుపై షోకాజ్ నోటీసు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!