
జనరల్

జమ్మూకశ్మీర్లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారు. ఆర్మీ, పోలీసులు, స్థానిక సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ ప్రకృతి విపత్తుతో 130కిపైగా ఇళ్లు, 18 పాఠశాలలు, వాహనాలు, పంటలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యవసరంగా జమ్మూకు చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!