
జనరల్

భారీ వర్షాల కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని శుభన్‌శ్రీ, కెయిపన్యార్ జిల్లాల్లో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు పొంగిపొర్లి పలు గ్రామాలు జలమయం అయ్యాయి. ఈ ప్రకృతి విపత్తులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక ఇళ్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, రహదారులు, ప్రజా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సహాయక బృందాలు సహాయ, రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలుచోట్ల వంతెనలు ధ్వంసం కావడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!