
జనరల్

దక్షిణాఫ్రికా ఒలింపిక్ చాంపియన్ స్విమ్మర్ చాడ్ లీ క్లాస్ తన ఇల్లు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైనట్లు వెల్లడించాడు. 34 ఏళ్ల లీ క్లాస్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 4×100 మీటర్ల మెడ్లే రిలేలో కాంస్య పతకం సాధించి, కామన్వెల్త్ చరిత్రలో 21వ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ విజయోత్సాహంలో ఉండగానే గత నెల 31న కేప్‌టౌన్‌లోని అతని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దశాబ్ద కాలంగా నివసిస్తున్న తన ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని లీ క్లాస్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!