

గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన శ్యామ్ గెహ్లోత్ (73), మధూబెన్ (68) దంపతులు తమపై కొనసాగుతున్న అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ నాయకుల వేధింపులను తట్టుకోలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. రాజస్థాన్‌కు చెందిన ఈ వృద్ధ దంపతులు 2016లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు, కుమార్తె సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నారు.
2006లో బమ్రోలీ గ్రామ పంచాయతీ పరిధిలో 12 దుకాణాలను కొనుగోలు చేసిన వీరికి, ఆ ప్రాంతం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం అయిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. 2021లో దుకాణాలను అధికారులు సీజ్ చేయగా, హైకోర్టును ఆశ్రయించిన దంపతులు ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత విజయం సాధించారు. కోర్టు ఆదేశాలతో సీలు తొలగించినప్పటికీ, మే నెలలో మళ్లీ ఎటువంటి నోటీసు లేకుండా సీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే అవసరమైన ఇంపాక్ట్ ఫీజు పత్రాలు ఇంకా సమర్పించలేదని కార్పొరేషన్ అధికారులు వివరణ ఇచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!