

ఫెమా (Foreign Exchange Management Act) చట్టం కింద నమోదైన ₹2,424.44 కోట్ల విలువైన ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కాంపౌండింగ్ ఆర్డర్ జారీ చేసింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద కంపెనీపై ₹17.76 కోట్ల జరిమానా విధించగా, డైరెక్టర్లు మరియు కీలక అధికారులైన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్.కే. వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్‌లకు ఒక్కొక్కరికి ₹18 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.
దర్యాప్తులో భాగంగా ఎఫ్‌డీఐ నిషేధిత రంగంలో విదేశీ పెట్టుబడులు స్వీకరించడం, ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పెట్టుబడులు తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌సీసీబీలు జారీ చేయడం, విదేశీ పెట్టుబడి పరిమితులను మించడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. అనంతరం అపోలో హాస్పిటల్స్ ఫెమా సెక్షన్ 15 కింద కాంపౌండింగ్ కోసం ఆర్బీఐని ఆశ్రయించింది. ఈడీ నిరభ్యంతర పత్రం ఇచ్చిన తర్వాత ఆర్బీఐ ఈ ఉల్లంఘనలను జరిమానాతో సెటిల్ చేసింది. దీంతో కంపెనీపై ఫెమా కింద కొనసాగుతున్న న్యాయపరమైన చర్యలన్నీ రద్దు కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!