
రాజకీయాలు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు ఉదయం నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు.
మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అక్రమాస్తులపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో వెలుగులోకి వచ్చిన ఆస్తుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!