
సినిమాలు

ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ విశాఖపట్నంలో శాటిలైట్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టైర్-2 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించడంపై కంపెనీ సీఈవో రోమల్ శెట్టి ఇటీవల స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విశాఖ రుషికొండ ఐటీ హిల్స్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ అడుగులు వేస్తోంది.
విశాఖపట్నం, మంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి నగరాలకు రీలొకేషన్ ఆసక్తి ఉన్న ఉద్యోగులను కంపెనీ ఈ-మెయిల్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం. ఐటీ కన్సల్టింగ్, టెక్నాలజీ, గ్లోబల్ ఫైనాన్స్, బీపీవో సేవలను అందించేందుకు డెలాయిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఉన్న నేపథ్యంలో డెలాయిట్ రాక మంచి పరిణామంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!