
క్రీడలు

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసును విచారించిన జస్టిస్ తేజస్ కరియా తీర్పు ప్రకటించనున్నారు. టెలిగ్రామ్ తనపై విధించిన నిషేధం కోట్లాది మంది వినియోగదారుల హక్కులను ప్రభావితం చేస్తోందని కోర్టులో వాదించింది.
విచారణ సందర్భంగా కొద్దిమంది దుర్వినియోగం కారణంగా సుమారు 15 కోట్ల మంది వినియోగదారుల హక్కులను పరిమితం చేయవచ్చా అని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. పేపర్ లీక్ అంశాలపై టెలిగ్రామ్ రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ కలిగి ఉందా అనే అంశంపైనా వివరణ కోరింది. మరోవైపు, నీట్ పరీక్షల పారదర్శకతను కాపాడేందుకే ఈ తాత్కాలిక నిషేధం విధించామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!