
జనరల్

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. మ్యాట్రిమోనీ మరియు పెట్టుబడుల పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సంగం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో మహిళగా నటిస్తూ బాధితుడిని నమ్మించి, వివాహం పేరుతో పరిచయం పెంచి నకిలీ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లో డబ్బు పెట్టేలా ప్రలోభపెట్టారు.
విడతల వారీగా బాధితుడి నుంచి మొత్తం రూ.46.65 లక్షలు వసూలు చేసిన నిందితులు, ఆ మొత్తాన్ని మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా హవాలా నెట్‌వర్క్ సహాయంతో సింగపూర్‌లోని సైబర్ ముఠాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్రలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!