

తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పనుల పురోగతిని పరిశీలించారు. ఇప్పటివరకు 3,918 కిలోమీటర్ల రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరయ్యాయని తెలిపారు. 2025–26లో రూ.868 కోట్లతో 422.36 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టినట్లు వివరించారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశిస్తూ, మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
సచివాలయంలో చేపడుతున్న సోలార్ కార్ పార్కింగ్ పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. సోలార్ పార్కింగ్ ద్వారా సచివాలయానికి నెలకు సుమారు 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులో 16 శాతం వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అధికారులు మరింత వేగంగా, సమన్వయంతో పనిచేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!