
జనరల్

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఉపశమన చర్యలు అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత కాల్ సెంటర్ ఆవరణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ మనజీర్ జిలానీ మంగళవారం కేంద్రాన్ని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను సమీక్షించారు.
సమీకృత కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్ 155251కు రైతుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు సిబ్బంది సమాధానాలు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఉపగ్రహ ఆధారిత హెచ్చరికలను జారీ చేస్తూ రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!