
జనరల్

2018లో తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన స్టెర్లైట్ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో బాధితులైన వారికి సీఎం విజయ్ ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు బాధితుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వం అందించిన పరిహారానికి అదనంగా ఈ నిధులను కేటాయించింది.
ఈ మేరకు మొత్తం రూ.5.25 కోట్ల అదనపు సాయాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 13 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి అదనంగా రూ.25 లక్షల చొప్పున అందించనున్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన 40 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!