
సినిమాలు

భారత్ ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ మఖానా ఉత్పత్తిలో భారత్ వాటా 80 నుంచి 85 శాతం వరకు ఉందని అంచనా. 2025–26 గణాంకాల ప్రకారం దేశంలో 80,590 మెట్రిక్ టన్నుల మఖానా ఉత్పత్తి కాగా, అందులో సుమారు 60,000 మెట్రిక్ టన్నులు బిహార్‌లోనే పండినట్లు సమాచారం. దీంతో ప్రపంచ మఖానా మార్కెట్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఉత్తర బిహార్‌లోని మిథిల, సీమాంచల్, కోసి నది పరివాహక ప్రాంతాలు మఖానా సాగుకు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా దర్భంగా, మధుబని, పూర్ణియా, కటిహార్, సుపౌల్ జిల్లాలు మఖానా ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాల్లో సాగు విస్తరణ, ఉత్పత్తి ద్వారా దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా భారత మఖానాకు ప్రాధాన్యం పెరుగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!