
ఓటీటీ

ఫార్ములా-ఈ రేస్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు ఉండదని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కేసు తీవ్రతను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.
నరేంద్ర మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ తన రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడనని, విచక్షణారహితంగా విచారణకు ఆదేశించనని స్పష్టం చేశారు. ఫార్ములా-ఈ కేసులో అరెస్టులు తన చేతిలో లేవని, తుది నిర్ణయం కోర్టులదేనని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!