

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో నిర్వహించిన సమీక్షలో ఆధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధిలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, సోలార్ ప్లాంట్ల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అలాగే ఖర్చులను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ సాంకేతికతను వినియోగించాలని అధికారులకు సూచించారు. శుద్ధి చేసిన మురుగు నీటిని నిర్మాణాల్లో వినియోగించడం తప్పనిసరి చేయాలని చెప్పారు. నల్గొండ–యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు కీలకమని, విమానాశ్రయాల రాకతో ఈ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని సీఎం పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!