
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం.. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఈ భేటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలతో పాటు వివిధ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి ఈ పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!