

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని, స్టాప్ వర్క్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కాలువల సామర్థ్యాన్ని పెంచేందుకు ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయాలని, నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
అలాగే కుడివైపు హెడ్ స్లూయిజ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చంద్రబాబు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఒడిశాకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, సీఆర్ పాటిల్ కలిసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన ఆయన, గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!