

భారత రాజ్యాంగం అప్పగించిన న్యాయ సమీక్ష బాధ్యతను తాము నిబద్ధతతో నిర్వర్తిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సామాజిక సంస్కరణలు, సంక్షేమ అంశాల్లో ఆ బాధ్యతను విస్మరించలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
శబరిమల సహా వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షను సవాల్ చేసిన పిటిషన్లపై 16 రోజుల పాటు జరిగిన విచారణ అనంతరం తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 29 వరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించవచ్చని తెలిపింది. సామాజిక సంస్కరణలు శాసన వ్యవస్థ బాధ్యత అయినప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయవ్యవస్థకు పాత్ర ఉంటుందని కోర్టు తెలిపింది. న్యాయ వ్యవస్థ అతివాద సంస్కరణవాది కూడా కాదని, ప్రేక్షక పాత్రలో ఉండదని అమికస్ క్యూరీ పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో సీజేఐ ఏకీభవించారు. మతపరమైన ఆచారాల్లో న్యాయ సమీక్ష తగదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!