
జనరల్

చైనాలో తయారైన డ్రోన్లు అక్రమంగా దేశంలోకి చేరుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకుని డ్రోన్ల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడుతున్న డ్రోన్లలో అత్యధికంగా చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ డీజేఐ (DJI) తయారు చేసినవే ఉండటం గమనార్హం. దీంతో కస్టమ్స్, భద్రతా సంస్థలు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశాయి.
అధికారుల వివరాల ప్రకారం, 2025లో మొత్తం 214 డ్రోన్లు స్వాధీనం చేసుకోగా, 2026లో ఇప్పటివరకు 18 డ్రోన్లు పట్టుబడ్డాయి. దిగుమతి నిబంధనలను ఉల్లంఘించి, కస్టమ్స్ సుంకాన్ని తప్పించేందుకు వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!