
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం బాసరను దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామానికి చేరుకుని, అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!