

చెన్నై పట్టినపాక్కం–శీనివాసపురం ప్రాంతంలో కొత్త అసెంబ్లీ-సచివాలయ సముదాయం నిర్మించాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై స్థానిక మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం స్థానికుల అభిప్రాయాలను తీసుకోకుండా నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపాదిత ప్రాంతం తమ పూర్వీకుల భూమితో ముడిపడి ఉందని, అక్కడ నిర్మాణం చేపడితే సంప్రదాయ జీవనాధారం, నివాసాలు, చేపల వేటకు సంబంధించిన కార్యకలాపాలు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టును పునఃపరిశీలించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
ముళ్లికుప్పం, శీనివాసపురం, రాజీవ్‌గాంధీ నగర్, భవాని కుప్పం, ఇరుదయపురం, సెల్వరాజ్‌పురం, డూమింగ్ కుప్పం, నొచ్చి నగర్, నొచ్చికుప్పం తదితర ప్రాంతాల మత్స్యకారులు ఈ అంశంపై సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21లోపు ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు సుమారు 25.55 ఎకరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!