
ఓటీటీ

దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, 17 ఏళ్ల ఓ యువకుడు టార్సస్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్లోకి ప్రవేశించి షాట్గన్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో రెస్టారెంట్ యజమాని, సిబ్బంది, ట్రక్ డ్రైవర్ మరియు పశువుల కాపరి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!