
షోస్

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ప్రాంగణంలో ‘తెలంగాణ జైల్ ఎక్స్‌పీరియన్స్’ కార్యక్రమం ప్రారంభమైంది. జైలు జీవితాన్ని దగ్గరగా తెలుసుకోవాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన అవకాశంగా నిలుస్తోంది. చారిత్రక జైలు వాతావరణం, బ్యారక్‌లు, జైలు క్రమశిక్షణ, ఖైదీల రోజువారీ జీవన విధానాన్ని సందర్శకులు ప్రత్యక్షంగా అనుభవించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ అనుభవం అందుబాటులో ఉంటుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ ఫోన్లను అప్పగించి, జైలు అధికారులు అందించే దుస్తులు ధరించడంతో పాటు జైలు భోజనం, యోగా, వ్యాయామం, పరేడ్, పని, వృత్తి శిక్షణ వంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. నాలుగు గంటల అనుభవానికి రూ.500, ఎనిమిది గంటలకు రూ.750, 12 గంటలకు రూ.1,000, 24 గంటలకు రూ.1,500 రుసుముగా నిర్ణయించారు. 18 ఏళ్లు పైబడిన వారు ఇందులో పాల్గొనవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!