
సినిమాలు

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికతో పాటు ఫేజ్-2 విస్తరణకు అవసరమైన నిర్మాణ వ్యయం, ఆర్థిక వనరులపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు.
ఈ ప్రక్రియ కోసం ఎస్‌బీఐక్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించిన అన్ని అంశాలపై సంస్థ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమన్వయ సభ్యులుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!