
జనరల్

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు పొదుపు చర్యలు పాటించాలని సూచించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన సర్క్యులర్లో విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పేర్కొంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన సంస్థల అధిపతులకు ఈ మేరకు లేఖలు పంపినట్లు సమాచారం. సమావేశాలు, సమీక్షలు వీలైనంత వరకు వర్చువల్గా నిర్వహించాలని, అవసరం లేని విదేశీ ప్రయాణాలను నివారించాలని సూచించింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కూడా పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!