

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీబీఐ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు విజయవాడ సీబీఐ బృందం తాజాగా రంగంలోకి దిగింది. గత నెలలో సాయికృష్ణ తల్లిని కృష్ణలంక పోలీస్స్టేషన్లో సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు పది రోజుల పాటు సాగిన విచారణలో పలు కీలక విషయాలను సేకరించినట్లు సమాచారం. కేసులోని వివిధ అంశాలపై అధికారులు ఆరా తీశారు.
ఈ క్రమంలో నిందితులుగా ఉన్న వెంకటరాజు, సురేష్లను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సాయికృష్ణ మృతి వెనుక ఉన్న పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై మరింత స్పష్టత కోసం తాజా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సేకరించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ అధికారులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!