
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కేసులో అరెస్టైన ముగ్గురు నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. రెండు రోజుల పాటు నిందితులను విచారించిన పోలీసులు పలు కీలక వివరాలను రాబట్టినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో ప్రధానంగా పేర్కొంటున్న సుమంత్ పరారీలో ఉండటంతో ఆయన కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!