

22A నిషేధిత భూముల జాబితాలో తమ ఆస్తులు చేరడంతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొంటున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలను విన్న హరీశ్ రావు, వారికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్‌లో 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
22A భూముల వ్యవహారంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితులు భయపడి కమీషన్లు చెల్లించవద్దని, ఒత్తిడికి లోనై తమ ఆస్తులను తక్కువ ధరలకు విక్రయించవద్దని సూచించారు. ఎమ్మెల్యేలుగా తాము అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితుల వెంట ఉంటామని తెలిపారు. నిషేధిత జాబితాలో అక్రమంగా చేర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములను వెంటనే పునరుద్ధరించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ, ప్రభుత్వం తక్షణ స్పందన ఇవ్వకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!