

అషురెడ్డి అకస్మాత్తుగా నిశ్చితార్థ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమెపై లండన్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి రూ.9.5 కోట్లు తీసుకుందనే ఆరోపణలతో కేసు నమోదైంది. ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది.
ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని అషురెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. అయితే దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో క్లిప్స్ కూడా బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో అషురెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు అషురెడ్డి, ఆమె తల్లిదండ్రులకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 41A నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!