
సినిమాలు

నటుడు విజయ్ దేవరకొండ తన దాతృత్వ కార్యక్రమాల్లో భాగంగా తన తండ్రి స్వగ్రామమైన తుమ్మనపేటతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని విద్యార్థులకు అండగా నిలిచారు. నటి రష్మిక మందన్నతో కలిసి ఆయన ఫిబ్రవరిలోనే తెలంగాణలోని 9వ, 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించాలనే నిర్ణయం ప్రకటించారు.
ఇప్పుడు దేవరకొండ ఫౌండేషన్ అధికారికంగా 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. వీరికి త్వరలో స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నారు. తుమ్మనపేట గ్రామ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ చర్యపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!