28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ఏఐ సాక్షమ్‌’ను ప్రారంభించిన భట్టి విక్రమార్క

Writer: Chandrika 03:06 PM, 28 అక్టోబర్, 2026
'ఏఐ సాక్షమ్‌’ను ప్రారంభించిన భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేరాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్‌ నిర్వహించిన ‘ఏఐ సాక్షమ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏఐ ద్వారా ఆదా అయ్యే సమయం ప్రజలకు మెరుగైన సేవల రూపంలో అందాలని, రైతులు, పింఛనుదారులు, సామాన్య పౌరులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగే పరిస్థితి తగ్గాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడమే ప్రభుత్వ పాలనలో ఏఐ విజయానికి ప్రధాన కొలమానమని స్పష్టం చేశారు.

ప్రజాధన వినియోగాన్ని విశ్లేషించడం, ప్రాజెక్టుల్లో జాప్యాలను గుర్తించడం, సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లను తెలుసుకోవడం, విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేయడం వంటి అంశాల్లో ఏఐ ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క వివరించారు. అయితే, ఏఐ గుర్తించిన అసాధారణ ధోరణులను అక్రమాలకు ఆధారాలుగా పరిగణించరాదని, సమాచారాన్ని ధ్రువీకరించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత, ఏఐ ఆధారిత నిర్ణయాలపై మానవ పర్యవేక్షణ, తప్పులకు బాధ్యత వహించే అధికారుల గుర్తింపు తప్పనిసరని పేర్కొన్నారు. తొలుత చిన్నస్థాయి ప్రయోగాలు నిర్వహించి, వాటి ఫలితాలను అంచనా వేసిన తర్వాతే విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌, టీజీ మ్యాథ్‌ ఎండీ పూజ, ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోచింగ్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం రక్తం అమ్ముకుంటున్న విద్యార్థులు?

కోచింగ్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం రక్తం అమ్ముకుంటున్న విద్యార్థులు?

తుఫాన్ సహాయక చర్యలపై పవన్ కీలక ఆదేశాలు..

తుఫాన్ సహాయక చర్యలపై పవన్ కీలక ఆదేశాలు..

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో హర్దీప్ సింగ్ పురి

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో హర్దీప్ సింగ్ పురి

డిజిటల్‌ అరెస్టు అంటే డిజిటల్‌ దోపిడీనే.. సైబర్‌ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు

డిజిటల్‌ అరెస్టు అంటే డిజిటల్‌ దోపిడీనే.. సైబర్‌ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు

రైళ్లలో రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్‌పై రైల్వే శాఖ కీలక హెచ్చరిక

రైళ్లలో రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్‌పై రైల్వే శాఖ కీలక హెచ్చరిక

పులివెందులలో రబ్బర్‌ బుల్లెట్‌ గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

పులివెందులలో రబ్బర్‌ బుల్లెట్‌ గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

ట్యాగ్లు
భట్టి విక్రమార్కఏఐ సాక్షమ్‌తెలంగాణ ప్రభుత్వంకృత్రిమ మేధస్సుడిజిటల్‌ పాలనప్రజా సేవలుప్రభుత్వ ఉద్యోగులుసమాచార భద్రతసంక్షేమ పథకాలుహైదరాబాద్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచ పర్యటనకు బ్రేక్.. కంబోడియా పోర్టులో నిలిచిపోయిన విలాస నౌక
జనరల్

ప్రపంచ పర్యటనకు బ్రేక్.. కంబోడియా పోర్టులో నిలిచిపోయిన విలాస నౌక

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబాటు
జనరల్

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబాటు

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం
జనరల్

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

అభిజీత్‌ దీప్కేకు రాందాస్‌ అథవాలే మరోసారి ఆహ్వానం..
రాజకీయాలు

అభిజీత్‌ దీప్కేకు రాందాస్‌ అథవాలే మరోసారి ఆహ్వానం..

భారత్‌లో ఒకరోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల
సినిమాలు

భారత్‌లో ఒకరోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల

SIR పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోంది - పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రాజకీయాలు

SIR పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోంది - పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కోచింగ్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం రక్తం అమ్ముకుంటున్న విద్యార్థులు?
జనరల్

కోచింగ్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం రక్తం అమ్ముకుంటున్న విద్యార్థులు?

తుఫాన్ సహాయక చర్యలపై పవన్ కీలక ఆదేశాలు..
జనరల్

తుఫాన్ సహాయక చర్యలపై పవన్ కీలక ఆదేశాలు..

ఇండస్ట్రీ వివక్షపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీ వివక్షపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 52 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 52 ప్రోమో 2 విడుదల

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో హర్దీప్ సింగ్ పురి
జనరల్

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో హర్దీప్ సింగ్ పురి

డిజిటల్‌ అరెస్టు అంటే డిజిటల్‌ దోపిడీనే.. సైబర్‌ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు
జనరల్

డిజిటల్‌ అరెస్టు అంటే డిజిటల్‌ దోపిడీనే.. సైబర్‌ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!