

బెంగళూరులోని ప్రముఖ ఊర్వశి థియేటర్ ఇక చరిత్రలో కలిసిపోనుంది. లాల్‌బాగ్ మెయిన్ రోడ్డులో ఉన్న ఈ ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్ 1970లో ప్రారంభమై దాదాపు 55 ఏళ్ల పాటు సినీ ప్రియులకు ప్రత్యేక అనుభూతిని అందించింది. 1,100కు పైగా సీట్ల సామర్థ్యంతో భారీ స్క్రీన్, అభిమానుల సందడి, ఫ్యాన్ షోలతో ఊర్వశి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వివిధ భారతీయ భాషల్లో వేలాది చిత్రాల ప్రదర్శనకు ఈ థియేటర్ వేదికగా నిలిచింది.
బాక్సాఫీస్ రికార్డుల పరంగానూ ఊర్వశికి ప్రత్యేక స్థానం ఉంది. KGF: Chapter 2 ఈ థియేటర్‌లో ఆల్‌టైమ్ డే 1 రికార్డును నమోదు చేయగా, Baahubali 2: The Conclusion ఆల్‌టైమ్ అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది. అలాగే రజనీకాంత్ చిత్రాలు అత్యధికంగా రూ.1 కోటి గ్రాస్ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2018లో లీజ్ గడువు ముగిసిన అనంతరం సాగిన భూవివాదం, సుదీర్ఘ న్యాయ ప్రక్రియల నేపథ్యంలో థియేటర్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!