

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో జరిగిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు, తుపాకీ దాడులతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకోవాలని కొందరు ప్రణాళిక చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుట్రను ఈవెంట్‌కు నాలుగు రోజుల ముందే గుర్తించిన ఎఫ్‌బీఐ, డైరెక్టర్ కాశ్ పటేల్ నేతృత్వంలో దాడిని భగ్నం చేసి పలువురిని అరెస్టు చేసింది.
ఈ కేసులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా, ఒహాయోకు చెందిన 19 ఏళ్ల యువకుడు టైసెన్ ప్రాపర్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. వైట్‌హౌస్ మ్యాప్‌లు, తప్పించుకునే మార్గాలు, దాడి ప్రణాళికలపై ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 20 సందేశాలను విశ్లేషించగా, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీన్ని సమన్వయంతో చేసిన ఉగ్ర కుట్రగా అభివర్ణించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!