23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఆసక్తికర అప్‌డేట్‌

Writer: Pooja 07:41 PM, 23 నవంబర్, 2026
సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఆసక్తికర అప్‌డేట్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఇటీవల సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ కుమారుడు, నటుడు రాజ్‌వీర్‌ డియోల్‌తో సారా వివాహం జరగనుందని, అది కూడా 2027లోనే అంటూ కథనాలు వెలువడ్డాయి. క్రికెట్‌, సినీ రంగాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని సారాకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి స్పష్టం చేసినట్లు సమాచారం. సారా, రాజ్‌వీర్‌ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని, ప్రస్తుతం ఆమె సింగిల్‌గా ఉంటూ తన పనిపై దృష్టి సారించిందని వెల్లడించారు. నిరాధారమైన ఇలాంటి ప్రచారం ఆమెకు ఇబ్బంది కలిగిస్తోందని, అయినప్పటికీ సారా ఈ వార్తలపై స్పందించకుండా హుందాగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 2027లో వారి పెళ్లి జరగనుందంటూ సాగిన ప్రచారానికి తెరపడినట్లయింది.

ఇదిలా ఉంటే.. గతంలో సారా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన తమ్ముడు అర్జున్‌ టెండూల్కర్‌ వివాహాన్ని ఒక ట్రయల్‌ రన్‌లా భావించానని, దాని ద్వారా తన పెళ్లిలో ఏం ఉండాలి, ఏం వద్దనే విషయంపై స్పష్టత వచ్చిందని తెలిపింది. చిన్నతనంలో గ్రాండ్‌ వెడ్డింగ్‌, పాస్టెల్‌ రంగుల బ్రైడల్‌ లుక్‌ కావాలని కలలు కన్నానని, ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చిన్న వేడుక జరుపుకోవడానికే ఇష్టపడతానని చెప్పింది. పెళ్లికి ముందే భాగస్వామి లేదా వారి కుటుంబం విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే ఆ బంధం నుంచి బయటకు రావడంలో తప్పులేదని కూడా అభిప్రాయపడింది. తన తల్లిదండ్రుల అనుబంధాన్ని ఆదర్శంగా తీసుకునే సారా.. జీవిత భాగస్వామి విషయంలో స్నేహం, పరస్పర గౌరవానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు గతంలో వెల్లడించింది. ప్రస్తుతం తన పెళ్లిపై ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నివేదా థామస్‌ ‘శ్రీమతి’ ట్రైలర్‌ విడుదల

నివేదా థామస్‌ ‘శ్రీమతి’ ట్రైలర్‌ విడుదల

‘ఫ్యామిలీ ప్యాక్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శ్రీ విష్ణు

‘ఫ్యామిలీ ప్యాక్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శ్రీ విష్ణు

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

ట్యాగ్లు
సారా టెండూల్కర్రాజ్‌వీర్ డియోల్సచిన్ టెండూల్కర్సన్నీ డియోల్పెళ్లి వార్తలుసెలబ్రిటీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అభ్యర్థులకు ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
జనరల్

అభ్యర్థులకు ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ
జనరల్

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ

బిహార్‌ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు
జనరల్

బిహార్‌ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు

సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

సారా టెండూల్కర్‌ పెళ్లిపై ఆసక్తికర అప్‌డేట్‌

యూసుఫ్‌ పఠాన్‌పై మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు
రాజకీయాలు

యూసుఫ్‌ పఠాన్‌పై మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు

ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో కత్తితో దాడి..పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు
జనరల్

ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో కత్తితో దాడి..పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ కీలక నిర్ణయం

నివేదా థామస్‌ ‘శ్రీమతి’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

నివేదా థామస్‌ ‘శ్రీమతి’ ట్రైలర్‌ విడుదల

‘ఫ్యామిలీ ప్యాక్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శ్రీ విష్ణు
సినిమాలు

‘ఫ్యామిలీ ప్యాక్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శ్రీ విష్ణు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌
క్రీడలు

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
జనరల్

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!