

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టలు, ప్రాజెక్టులకు కృష్ణా నదీ జల వివాద ట్రైబ్యునల్-1 (బచావత్ ట్రైబ్యునల్) చేసిన నీటి కేటాయింపులను పునఃసమీక్షించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2 ఎదుట ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాల్సిందేనని పేర్కొన్నారు.
కృష్ణా డెల్టా సిస్టమ్, కేసీ కెనాల్, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇప్పటికే చేసిన కేటాయింపులను కొనసాగించాలని ఏపీ వాదించింది. నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగానే నీటి కేటాయింపులు జరపాలన్న తెలంగాణ వాదనకు ఆధారం లేదని జైదీప్ గుప్తా తెలిపారు. దీర్ఘకాలిక ప్రాజెక్టు అవసరాలు, దుర్భిక్ష ప్రాంతాలు, నదికి సమీప ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు జరుగుతాయని వివరించారు. గురువారంతో ఏపీ వాదనలు ముగియగా, శుక్రవారం నుంచి తెలంగాణ వాదనలు ప్రారంభం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!