
సినిమాలు

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. చిన్నారిని గుర్తించేందుకు చేపట్టిన దర్యాప్తు, శోధన చర్యలకు సంబంధించిన సమగ్ర స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టు ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను ఈ కేసులో అమలు చేశారా లేదా అనే విషయాన్ని కూడా తెలియజేయాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ధర్మాసనం సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!