
జనరల్

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025 మరియు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కింది.
డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలను అభినందించారు. గ్రామీణాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!