

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. దీంతో 2026-27 విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉండనున్నాయి. అదనంగా ఐదు ఐచ్ఛిక సెలవులు, మూడు స్థానిక సెలవులు కూడా కల్పించనున్నారు.
విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం 2027 మార్చి 15 నుంచి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించే లక్ష్యంతో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేయనున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 పీరియడ్లు, గరిష్ఠంగా 30 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు, సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17 వరకు ఉండనున్నాయి. మైనారిటీ విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవు షెడ్యూల్ను కూడా ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!