

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం 45 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 155 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, బయట పనులు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, తగినంత నీరు, ద్రవపదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడాలని, పలుచని దుస్తులు ధరించాలని తెలిపారు. వడదెబ్బలు, వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!