

బిగ్‌బాస్ తెలుగు 10లో పదో వారం ఫ్యామిలీ సందడి మొదలైంది. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి వస్తుండటంతో ఇంట్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. తొలుత నరేష్ తమ్ముడు హౌస్‌లోకి ప్రవేశించాడు. అతడిని చూసిన నరేష్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తమ్ముడు నరేష్‌ను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని సూచించాడు. బయట చాలామంది నరేష్‌ను విజేతగా భావిస్తున్నారని, అతడు ఏడిస్తే తల్లి కూడా బాధపడుతోందని చెప్పాడు. నువ్వే పెద్దవాడివి.. ఇలా బాధపడితే ఎలా అంటూ ప్రోత్సహించాడు. కుటుంబ సభ్యుడి నుంచి వచ్చిన మాటలతో నరేష్ కొంత ఉత్సాహం పొందినట్లు కనిపించింది. ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని ఇద్దరూ కలిసి పంచుకోవడం ఈ కలయికలో మరో భావోద్వేగ క్షణంగా నిలిచింది.
మరోవైపు, ఇంట్లో వినోదాన్ని పంచేందుకు బిగ్‌బాస్ బీబీ స్కూల్ టాస్క్‌ను ప్రారంభించారు. ఈ టాస్క్‌లో త్రిగుణ్, ముకేష్, శివ్, రామ్ ప్రసాద్, ఆర్కే తదితరులు చిన్నపిల్లల వేషధారణలో కనిపించారు. నరేష్ స్కూల్ టీచర్‌గా బాధ్యతలు చేపట్టగా, మిగతా కంటెస్టెంట్లు విద్యార్థుల్లా సందడి చేశారు. త్రిగుణ్, ముకేష్ కావాలనే గొడవ పడటంతో వారిని అదుపు చేయడానికి టీచర్ నరేష్ ఇబ్బందిపడ్డాడు. ఇలా ఒకవైపు ఫ్యామిలీ మెంబర్ల రాకతో భావోద్వేగాలు, మరోవైపు స్కూల్ టాస్క్‌తో నవ్వులు పంచేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో మరికొందరు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు కూడా కంటెస్టెంట్లకు మద్దతుగా వచ్చే అవకాశం ఉంది. గతవారం దీపావళి సందర్భంగా నో ఎలిమినేషన్ ప్రకటించడంతో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్కే, శ్వేత, సుధీర్, వర్షిణి, నీతూ వంటి కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌పై చర్చ జరుగుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!