
జనరల్

దేశవ్యాప్తంగా అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 9న అన్ని రాష్ట్రాల డీజీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని తిరిగి పంపించడం, నకిలీ పత్రాల ముఠాలను కట్టడి చేయడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి. అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!