
షోస్

దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రధానంగా హైదరాబాద్‌కు 1,186, బెంగళూరుకు 475, విశాఖపట్నానికి 440, రాజమహేంద్రవరానికి 347 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తిరుపతికి 247, చెన్నైకి 153 సర్వీసులను నడపనున్నారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!