
రాజకీయాలు

హైదరాబాద్లోని అన్నమయ్యపురంలో నిర్వహించిన అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో అక్షర డ్యాన్స్ అకాడమీ విద్యార్థినులు అద్భుత నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గురువు నియంత్రి రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించారు.
సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ శోభా రాజ్ హాజరై విద్యార్థులను అభినందించారు. ప్రేక్షకుల నుంచి ఈ ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!