
జనరల్

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 319 పాయింట్లుగా నమోదైంది. గాలిలో దుమ్ము, ధూళి కణాల తీవ్రత పెరగడంతో వాతావరణం కలుషితంగా మారింది. కాలుష్య ప్రభావంతో రహదారులపై దూరంగా కనిపించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలోని 59 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 38 చోట్ల గాలి నాణ్యత సూచీ 300 పాయింట్లను దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నగరవ్యాప్తంగా గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. పెరుగుతున్న కాలుష్యం ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణ పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!