
జనరల్

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం ఆరోగ్యసేతు 2.0 యాప్‌ను ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ఉపయోగించిన యాప్‌కు ఆధునిక రూపమే ఈ కొత్త వెర్షన్. పౌరులు తమ వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, బీమా కవరేజీ, క్లెయిమ్‌ల వివరాలు తెలుసుకోవడానికి ఇది డిజిటల్ వేదికగా పనిచేస్తుంది.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుగుణంగా రూపొందించిన ఈ యాప్‌లో ‘స్కాన్ అండ్ షేర్’ ఫీచర్ ఉంది. ఏబీహెచ్ఏ ఐడీ సృష్టి, ఆరోగ్య రికార్డుల నిర్వహణ, ఆసుపత్రుల్లో డిజిటల్ రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. నడ్డా యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘అనీమియా ముక్త్ భారత్’ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!