
రాజకీయాలు

కొండాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయంలో జరుగుతున్న రోజువారీ విధుల నిర్వహణ, పనుల్లో జాప్యం, ఏజెంట్ల పాత్రపై అధికారులు విచారణ చేపట్టారు.
డ్రైవింగ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్లు అక్రమంగా ఏజెంట్ల ద్వారా జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంవీఐలు, ఏఎంవీఐలను కూడా విచారిస్తున్నారు. అనుమానితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!