
సినిమాలు

మెదక్ జిల్లా నర్సాపూర్లో అనుమానిత ఫుడ్ పాయిజనింగ్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 19 మందిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.
వారిలో సాయిరాం (19) పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిరాం మృతి చెందాడు. మిగిలిన 18 మంది నర్సాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు, ఆహారం కలుషితమైందా అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!