
క్రీడలు

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీలు సంచలనం సృష్టించాయి. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ప్రభుత్వ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు.
అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారికి అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీ మోహన్‌పై విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!